రైతు భీమా పథకంలో నమోదు చేసుకోండి

Published: Wednesday August 11, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 10 ఆగస్ట్ ప్రజా పాలన : 3 ఆగస్ట్ 2021 వరకు పట్టా పాస్ బుక్ పొందిన వారు రైతు బీమా పథకంలో నమోదు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం ఒక ప్లురకటనలో పునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు బీమా పథకంలో ఇప్పటి వరకు నమోదుచేసుకోలేని వెంటనే నమోదు చేసుకోవాలని హితవు పలికారు. పట్టాదారుడే స్వయంగా వెళ్ళి నమోదు చేసుకోవాలని సూచించారు. మీ పరిధిలోని సంబంధిత వ్యవసాయ అధికారిని కలిసి అవసరమైన పత్రాలను అందించాలని కోరారు. రైతులకు దగ్గరలో గల రైతు వేదిక లోని అధికారికి సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరూ తమ పరిధిలోని అర్హత కలిగిన రైతులకు అవగాహన కల్పించి రైతు భీమా పథకంలో నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.
కావలసిన పత్రాలు : 
 రైతు భీమా నమోదు ఫారం. పట్టాదారు పాస్ బుక్. పట్టాదారుని ఆధార్ కార్డ్. నామిని ఆధార్ కార్డ్.
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత :
మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోమిన్ పేట్ మండల పరిధిలో గల ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డికి రూ.28,500. మర్పల్లి గ్రామానికి చెందిన రహీమ భేగమ్ కు రూ.1,50,000. మొత్తం రూ.1,78,500 విలువ గల రెండు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.