మధ్యాహ్న భోజన పథకం సామజిక తనిఖీ

Published: Friday March 10, 2023

   జన్నారం, మార్చి 09, ప్రజాపాలన:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తoగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించేందుకు కేంద్ర కమిటీ బృందం గత శనివారం నుండి గురువారం వరకు సర్వే తనిఖీ నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీపిఎస్ ఇంగ్లీష్ మీడియం పొన్కల్ పాఠశాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని పేద విద్యార్థులని వారికీ మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.  ప్రధానోపాధ్యాయులు జాజాల శ్రీనివాస్ ప్రతిరోజు వంటను  పరిశీలించాలని, క్రమం తప్పకుండా గుడ్లు వడ్డించాలన్నారు. మండలంలోని మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దబడతాయనడానికి ఈ ప్రభుత్వ పాఠశాలే ఒక మంచి ఉదాహరణని పొన్కల్ పాఠశాలను ఉద్దేశించియన్నారు. ఈ సందర్బంగా పొన్కల్ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయుడు ప్రభాకర్ బోధిస్తున్న ఆంగ్ల పాఠాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, పొన్కల్, సర్పంచ్ జక్కు భూమేష్, కిష్టాపూర్ గ్రామా సర్పంచ్, కోల తార పద్మారావు, ఉప సర్పంచ్ శ్రీనివాసగౌడ్, గాజుల  మల్లేష్, కిష్టాపూర్, పొన్కల్ ఎస్ ఎం సి చైర్మన్ మల్లేష్, మొగిలి, ఎన్సిసి అధికారి కట్ట రాజమౌళి, కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి మురళి, సి అర్ పి శేఖర్, దయాకర్, డి ఎం ఎం సామజిక తనిఖీ బృందం, మధ్యాహ్న భోజన వంటకురాలు ఐలవేణి లక్ష్మి, లావణ్య,  రమేష్, శ్రీనివాస్ లు విద్యార్థులు తల్లి-దండ్రులు, పాల్గొన్నారు.