మధిర రూరల్ జూన్ 20 ప్రజా పాలన ప్రతినిధి రైతువేదిక నందు నక్కలగరుబు మరియు సిరిపురం గ్రామాల నుండ

Published: Tuesday June 21, 2022
అధిక సాంద్రత పత్తి  పథకం కు ఎంపికైన రైతులకు ఈ అధిక సాంద్రత పత్తి సాగు పై  అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు *డా. రుక్మిణి దేవి మరియు *డా. వేణుగోపాల్ *  ఈ పత్తిలోఅధిక  సాంద్రత విధానం కార్యక్రమానికి హాజరై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనగా పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య మరియు వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు ఎక్కువ మొక్కలు వచ్చే విధంగా అనగా వరుసల మధ్య 80సెంటీమీటర్లు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు (80*20 cm) విత్తుకుంటే 25000 మొక్కలు వస్తాయి. ఈ పద్ధతిలో మొక్కల సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడానికి 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఈ పద్ధతిలో మొక్కల పెరుగుదల నియంత్రించే హార్మోన్ మేపిక్వాట్ క్లోరైడ్(చమత్కర్) 5 శాతం పంట వేసిన 45 రోజు ,75 వ రోజు,  1 మిల్లీలీటర్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మొక్కలు గుబురుగా పెరగక,  కాయలు బరువుగా ఒకేసారి పత్తి తీతకు కు రావడం వల్ల అ పంటకాలం తగ్గి యాసంగిలో రెండో పంటకు అనువుగా ఉంటుంది .
పంట తొందరగా చేతికి రావడం వల్ల గులాబి రంగు పురుగు ఉధృతి తగ్గుతుంది .అలాగే రైతులు ఆరుతడి పంటలను వేసుకోవడం వలన సుస్థిర దిగుబడులు పొందవచ్చునని తెలిపారు. ఈ విధానం లో వర్షాధార తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి.ఈ కార్యక్రమంలో మధిర ADA కొంగర వెంకటేశ్వరరావు , ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు , మండల రైతు బంధు సమన్వయ  కమిటీ చైర్మన్  చావా వేణు , మండల  వ్యవసాయ అధికారి  DNK శ్రీనివాసరావు , నూజివీడు కంపెనీ డిస్ట్రిబ్యూటర్ రమణారెడ్డి , కృష్ణారావు , AEO  సింధూర్, వంశీకృష్ణ, కమల్ హాసన్ మరియు రైతులు పాల్గొన్నారు.