వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నారాయణ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Published: Saturday February 04, 2023
వికారాబాద్ బ్యూరో 3 ఫిబ్రవరి ప్రజాపాలన :
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి నారాయణ రెడ్డి గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అయన మీడియా ప్రతినిధులతో  మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అధికారులు,  ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. రాబోవు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించెందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ తో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ను కలిసి స్వాగతం పలుకుతున్న జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ.