జగద్గిరిగుట్టలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం

Published: Thursday November 18, 2021
హైదరాబాద్ 17 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : జగద్గిరిగుట్ట మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు శ్రీ జి చెన్నయ్య గారు పాల్గొని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్  5వ తేదీ నుంచి ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన 'హలో మాల- -చలో ఢిల్లీ' కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ డిసెంబర్ 5 నుండి 14 వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే ర్యాలీ నిరసన కార్యక్రమంలో అత్యధికంగా రెండు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో మాల మహానాడు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి విచ్చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పిలుపును రాజ్యాంగ బద్ధంగా న్యాయ బద్ధంగా లక్షలాదిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. అదే విధంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకుంటామని కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలను హెచ్చరించారు. అదేవిధంగా బిఎస్పీ అధినేత మాయావతి మరియు కేంద్ర సామాజిక మంత్రి వర్యులు రాందాస్ అథవాలే కలిసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దుర్గయ్య మాలమహానాడు జగద్గిరిగుట్ట అధ్యక్షుడు రాజేశ్వరరావు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భగత్ సింగ్ నగర్ వెంకటేష్, మాలమహానాడు జగద్గిరిగుట్ట ఉపాధ్యక్షుడు మల్లేష్, క్యాషియర్ అబ్రహం, జగద్గిరిగుట్ట వర్కింగ్ ప్రెసిడెంట్, సోమనాథ్, తదితరులు పాల్గొన్నారు.