వైరా నదిలోకి వస్తున్న మురుగునీరు*

Published: Monday January 02, 2023
ప్రత్యేకంగా కాలువను ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు*

మధిర జనవరి 1 (ప్రజాపాలన ప్రతినిధి) పట్టణంలోని శివాలయం వద్ద ప్రవహిస్తున్న వైరా నది కలుషితమవుతుంది. పట్టణంలో ఉన్న మురుగునీరు అంతా వైరా నదిలోకి ప్రవేశించడం వలన నది మొత్తం మురికి కూపంగా మారింది. దీనివల్ల శివాలయం కొచ్చే భక్తులకు పుణ్య స్థానాలు చేసేందుకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న కాశిగా పేరుగాంచిన మధిర శివాలయంకి నిరంతరం భక్తులొస్తుంటారు. శివాలయానికి వచ్చిన భక్తుల్లో శివాలయం వద్ద ఉన్న వైరా నదిలో కొంత మంది పుణ్య స్థానాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న మురుకు నీరు బయటకు వెళ్లేందుకు రెండున్నర కోట్ల రూపాయలతో డ్రైనేజీ నిర్మించారు. పట్టణంలో ఉన్న మురుగునీరు వర్షపు నీరు ఈ డ్రైనేజీ ద్వారా వైరా నదులు కలుస్తుంది. డ్రైనేజీ ని నిర్మించిన కాంట్రాక్టర్ మురికి నీరు వెళ్లేందుకు ప్రత్యేక కాలవ ఏర్పాటు చేయకుండా శివాలయం వద్దకు తీసుకొని వచ్చి వదిలేసారు. దీనివల్ల శివాలయం స్థానాల ఘాటు మొత్తం మురికి కూపంగా మారింది. అంతేకాకుండా డ్రైనేజీతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన వచ్చి  భక్తులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా శివాలయం వద్ద వైరా నదిపై కరకట్టడంతో స్థానాలు ఘాటు వద్ద వైరానదిలో నీరు ప్రవహించటం లేదు. దీంతో ఆ ప్రాంతమంతా మురికి నీతితో నిండి ఉంది. మహాశివరాత్రి సందర్భంగా మధిర శివాలయానికి తెలుగు రెండు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు కూడా ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కారున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులు పుణ్య స్థానాలు చేసేందుకు తక్షణమే శివాలయం వద్ద ఉన్న స్థానాల ఘాటులోకి మురికి నీరు రాకుండా మున్సిపల్ అధికారులు, శివాలయం పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.