మహిళలు ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యం

Published: Thursday October 14, 2021
ద్యాచారం సర్పంచ్ ఎల్లన్నోల్ల అంజయ్య
వికారాబాద్ బ్యూరో 13 అక్టోబర్ ప్రజాపాలన : మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ద్యాచారం గ్రామ సర్పంచ్ ఎల్లన్నోల్ల అంజయ్య అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో ఉప సర్పంచ్ సరోజినీ బాబు గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ కార్యదర్శి పుష్ప రేషన్ డీలర్ సత్తయ్యలతో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న అని కొనియాడారు. ద్యాచారం గ్రామానికి 240, ఐనాపూర్ గ్రామానికి 70 మొత్తం 310 చీరలు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ద్యాచారం గ్రామం మహిళలకు 195 ఐనాపూర్ గ్రామ మహిళలకు 55 బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. గ్రామంలో స్వచ్ఛభారత్ అంశానికి సంబంధించిన పెయింటింగ్ వేయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ టి.గోపాల్,  విఆర్ఏ అంజయ్య, అంగన్వాడి టీచర్ యాదమ్మ, వార్డ్ మెంబర్ పట్లోళ్ళ రజినీకాంత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.