విఆర్ఏ సమస్యలపై నిర్బంధం చేసిన తాసిల్దార్ కార్యాలయం

Published: Tuesday October 11, 2022
మధిర అక్టోబర్ 10ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో వీఆర్ఏ సమస్యలపై78 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి వీఆర్ఏ లకు గవర్నమెంట్ ఎటువంటి హామీ ఇవ్వనందున రాష్ట్ర కమిటీ తాసిల్దార్ కార్యాలయ దిగ్బంధనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు దేవినేని పుల్లారావు  కోట నరేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం విఆర్ఓ వ్యవస్థ రద్దు చట్టంలో భాగంగా వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి పే స్కేలు వారసులకు ఉద్యోగాలు అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తానని చెప్పి జాప్యం జరుగుతున్న తరుణంలో పలుమార్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు మెమోరండం ఇచ్చి ఉన్న ఎటువంటి పురోగతి లేని కారణంచేత సమ్మె మొదలుపెట్టడం జరిగిందని గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా జాప్యం చేసుకుంటూ కాలం వెల్లదీస్తుందని ఇకనైనా గవర్నమెంట్ విఆర్ఎల పట్ల సానుకూలంగా స్పందించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిందిగా  ముఖ్యమంత్రి ని కోరుతున్నాము లేకపోతే ముందు ముందు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో  మండల పరిధిలో అన్ని గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు