విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి

Published: Wednesday July 27, 2022

మధిర జులై 26 ప్రజా పాలన ప్రతినిధి ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు మెస్  చార్జీలను పెంచాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ డిమాండ్ చేశారు మంగళవారం  అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్  మధిర నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మధిర హరిజనవాడ స్కూల్ విద్యార్థులు తో కలిసి మధిర పట్టణంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ రాంబాబుకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు ఐదు సంవత్సరాల నుంచి మెస్ చార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యమైన భోజనం అందటం లేదన్నారు. పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు  అనుగుణంగా  మెస్ చార్జీలను పెంచాలని అద్దె భవనాలలో నడుస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని ఎన్నో సందర్భంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసినా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించడం లేదన్నారు. ప్రజల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ కాలేశ్వరం సచివాలయం నిర్మాణాల పేరుతో వృధా చేస్తున్నారని ఆయన విమర్శించారు పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలు అవుతున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు  అందించకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మెస్ చార్జీలను పెంచాలని పాఠ్యపుస్తకాలను ఇవ్వాలని ఖాళీగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ మేరా ఉగ్గం సురేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మొండితోక లక్ష్మణ్ మండల కన్వీనర్ గురిజాల నవీన్ వెంకట్ స్వాతి మౌనిక వేదన దీప్తి తదితరులు పాల్గొన్నారు.