ఉపాధి హామీ పనులను ప్రారంభించాలి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు క

Published: Tuesday February 07, 2023
జన్నారం, ఫిబ్రవరి 06,
 ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న 29 గ్రామ పంచాయతీలలో సర్పంచులు వారి వారి గ్రామంలోని ఉపాధి హామీ పనులను ప్రారంభించ చేయవలసిందిగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కండ్ల శ్రావణ్ కుమార్ కోరరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ కుటుంబాలలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్ అందజేయాలన్నారు. అదేవిధంగా జన్నారం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ జాడి గంగాధర్ నేడు ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వీలైనంత తొందరలో ఉపాధి హామీ పనులను అందరికీ  కల్పించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తౌట్ సంజీవ్, మండల అధ్యక్షులు ములకల ప్రభాకర్, మండల ఉపాధ్యక్షులు జూల స్వామి, జనరల్ సెక్రెటరీ అజయ్ కుమార్, షర్మిల, లక్ష్మణ్, నాగరాజు, కుంద నవీన్, బత్తుల భూమేష్, తదితరులు పాల్గొన్నారు.