ముందస్తు సూచనలు కనిపిస్తున్నాయి.

Published: Monday March 21, 2022
ఎన్నికలు ఎపుడచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.
మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .
మంచిర్యాల బ్యూరో, మార్చి20, ప్రజాపాలన: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికల కు పోయె సూచనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఎపుడచ్చినా ఎదుర్కొవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  అన్నారు. ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటంతో ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా పార్టీ సంస్థాగతంగా కమిటీలను నియమించినట్లు ఆయన వెల్లడించారు. మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షునిగా తూముల నరేష్ , నస్పూర్ పట్టణ  అధ్యక్షుడిగా బండారి సుధాకర్,  జిల్లా ప్రధాన కార్యదర్శి గా భూపతి శ్రీనివాస్ ను నియమించారు.  అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షునిగా వడ్డే రాజమౌళి పేరును ప్రతిపాదిస్తూ అధిష్టానంకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పవన్, నాయకులు కొండ శేఖర్, శ్రీపతి మల్లేష్, పుదరి ప్రభాకర్, బొల్లం భీమయ్య, కిషన్, కురిమిల్ల మహేష్, రాజుకుమార్, రాజేష్, దుస్స తిరుపతి, పల్లవి, అర్కాల హేమలత, రామగిరి శైలజ, పుట్ట లావణ్య, పద్మ, లలిత, విజయ, తదితరులు పాల్గొన్నారు.