ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *సమస్య వలయంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బి సా

Published: Friday February 03, 2023

ఇబ్రహీంపట్నం కామ్రేడ్ పాషా నరహరి స్మర కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వి సామేలు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం  మున్సిపాలిటీ పాలక వర్గానికి పాలన చేయమని పట్టం కడితే మున్స్ పాలిటీలోని ప్రజల మౌలిక సమస్యలను పట్టించుకోలేని వారు కరువయ్యారని ఆయన అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఏ వార్డులో చూసిన ఏ బస్తికి వెళ్లిన రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు త్రాగునీరు సక్రమంగా లేని దుస్థితి ఉందన్నారు. ఎంబీఆర్ నగర్ లోని ఆర్టీసీ కాలనీలో ఉన్న పార్కు స్థలం కనుమరుగై పోయిందన్నారు. త్రిశక్తి కాలనీ బృందావన్ కాలనీ గాంధీనగర్ మహంకాళి నగర్ కాలనీలలో రోడ్లు సక్రమంగా లేక నేటికీ మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయన్నారు. వీధిలైట్లు స్తంభాలు వేయడం లేదన్నారు. బ్రిలియంట్ స్కూల్ దగ్గర్లో ఉన్నటువంటి ట్రాన్స్ ఫార్మర్ నుండి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. బ్రిలియంట్ స్కూల్ దగ్గర మిషన్ భగీరథ గేట్ వాల్ నడిరోడ్డుపై ఉంది. గేట్ వాల్ పై కప్పు కర్రలు పెట్టి సిసి పోశారు. ఎప్పుడు పగిలి ఎవరు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయం దగ్గర మిషన్ భగీరథ హెయిర్ వాల్ లీకేజ్   అవ్వడం వల్ల ఆఫీస్ రూమ్ ప్రహరీ గోడ కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా బాగు చేయని పరిస్థితి కానీ పాలకులు మాత్రం అవిశ్వాస తీర్మానం మీద ఉన్న మోజు అభివృద్ధి మీద పెడితే  బాగుండే  దన్నారు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మకై అందినంత దోచుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని అధికారులపై చర్యలు తీసుకోవాలని కొత్తగా వచ్చిన కలెక్టర్  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
లోని అన్ని మునిసిపాలిటీలపై చొరవ చూపి అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం,