వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఎక్కాహం భజన

Published: Tuesday May 17, 2022
మంచిర్యాల బ్యూరో, మే16, ప్రజాపాలన:
 
 
మంచిర్యాల వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ స్వామి కాలక్షేప మండపంలో 24 గంటల ఎక్కాహం అఖండ భజన సోమవారం ముగిసింది.  వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో మంచిర్యాల విశ్వనాధస్వామి ఆలయంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో నెల రోజుల వైశాఖ మాసం అమ్మవారి ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి భజన బృందం వారిచే 24 గంటల భజన కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ల సంయుక్త సౌజన్యంతో ఎక్కహం భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ భజన ఆదివారం ఉదయం 10 గంటల నుండి సోమవారం ఉదయం10 గంటల వరకు సాగింది .  ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్స్ క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాల మోహన్, రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్,  జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు దొంతుల ముఖేష్, యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్, వాసవిక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, వనితాక్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి , కోశాధికారి కటకం సునీత, యూత్ క్లబ్ అధ్యక్షుడు మల్యాల యోగేశ్వర్, కోశాధికారి బోనగిరి సాయి , మాజీ అధ్యక్షుడు పాత సాయి సూరజ్, కపుల్స్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, కోశాధికారి బజ్జూరి శ్రీవాణి శ్రీనివాస్, బెల్లంపల్లి భజన బృందం సభ్యులు చిలువేరు దయాకర్  , సిద్దంశెట్టో శ్రీనివాస్, తనుకు నందయ్య, కొత్త సురేందర్, ఇ ఓ ముక్తా రవి ,  వాసవిక్లబ్ ల సభ్యులు పాల్గొన్నారు.
 
*  పౌర్ణమి సందర్భంగా అన్నదానం.    
 
 వాసవి క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు దాతగా సహకరించిన   నేరెళ్ళ విజయలక్ష్మి - శంకరయ్య గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు నెరెళ్ళ శ్రీనివాస్- సరిత   అన్నదానం చేపట్టారు.ఈ అన్నదాన కార్యక్రమం లో  వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, వాసవిక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు కటకం హరీష్, క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, తంగెడిపల్లి సత్యవర్థన్ , చందూరి ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area