పెండింగ్ వేతనాలు చెల్లించాలి

Published: Friday September 02, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 01, ప్రజాపాలన : పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు  యూనియన్
 ఆధ్వర్యంలో గురువారం రోజున మంచిర్యాల జిల్లా
ప్రభుత్వ ఆసుపత్రి, సూపరింటెండెంట్, మెడికల్  కళాశాల ప్రిన్సిపాల్ లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సదర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ద్వారా సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ కేర్, స్విపర్స్  వివిధ భాగాలలో పని చేస్తున్నా వారికి నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నయాని, కొత్త టెండర్ వచ్చిన కాంట్రాక్టర్ ఇష్టనుసారంగా వ్యవరిస్తున్నారనీ.ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వర్కర్స్ కి 3000 రూపాయలు, పీ ఎఫ్,ఈ ఎస్ఐ కట్ చేయాల్సిన కాంట్రాక్టర్, కేవలం 1000 రూపాయలు మాత్రమే కట్ చేస్తున్నారు,ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి, వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అందరికి సమానంగా జివో ప్రకారం వేతనాలు,పీఫ్, ఈ ఎస్ఐ అమలు చేయాలి. లేని యెడల సెప్టెంబర్ 10 నుండి పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఔట్ సోర్సింగ్ అధ్యక్షులు చిప్పకుర్తి కుమార్,లక్ష్మి, శ్రీలత, సమత, సంగీత,సుమలత, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.