వైభవముగా అయ్యప్పల ఇరుముడి

Published: Friday December 09, 2022
మధిర డిసెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్వామి అయ్యప్ప దేవాలయంలో ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం లడక్ బజార్ అయ్యప్ప భక్త బృంద మరియు దేశభక్తి యోజన సంఘం వారి ఆధ్వర్యంలో
 స్వామి అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి వెళ్ళుటకు దీక్షలు చేపట్టిన అయ్యప్ప మాలదారులు గురువారం స్థానిక లడక బజారులోని అయ్యప్ప స్వామి ఆలయం నందు అత్యంత వైభవంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు.
అయ్యప్ప మాల ధరించి 41 రోజులపాటు కఠిన దీక్షలు చేసి, ప్రతి రోజు పూజ నిర్వహించిన అయ్యప్పలు ఉదయమే స్థానిక అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్న సుమారు వందమందికి పైగా అయ్యప్పలుస్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష చేస్తూ భక్తి పరవశం నడుమ వైభవముగా ఇరుముడి కార్యక్రమాన్నికొనసాగించారు.మాలాదారుల ఇరుముడిలో  భక్తులు, బంధువులు బియ్యం, డబ్బులు వేసి స్వాములకు పాదాభివందనం చేసి వారిచే ఆశీర్వాదం తీసుకొన్నారు.అనంతరం అయ్యప్ప మాలదారులు ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురుస్వాములు బత్తుల శ్రీనివాసరావు,  స్వామి చెరుపల్లి శ్రీధర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు శబరి దినేష్, అర్చకులు దేవంబట్ల కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారులకుఇరుముడులు కట్టారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదంలో అందజేశారు శబరిమలై బయల్దేరిన అయ్యప్ప మాలదారుల  ఇరుముడి కార్యక్రమంలో  పాల్గొనేందుకు  వచ్చిన బంధువులు,  మిత్రులతో ఆలయం ప్రాంగణ కోలాహలంగా మారింది.ఆలయ ప్రాంగణంలో ఇరుముడ్లు కట్టుకొని శబరిమలై లోని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు దేవాలయ వద్ద నుండి బయలుదేరిన అయ్యప్పలను భక్తులు,  బంధువులు కలసి రైల్వే స్టేషన్ వరకు మేళతాళాలతో భారీ ఎత్తున ఊరేగింపు తీసుకొని వెళ్లారు.