జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం ** (ఐజెయు)జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ *

Published: Tuesday February 14, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 13 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని దీర్ఘకాలికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని (టీయూడబ్ల్యూజే -ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. టీయూడబ్ల్యూజే -ఐ జే యు జిల్లా శాఖ పిలుపుమేరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని దశల వారి పోరాటంలో భాగంగా సోమవారం ఆసిఫాబాద్ తహసిల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా చేసి తహసిల్దార్ రామ్ మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చాలీచాలని వేతనాలతో జర్నలిస్టులు జీవితాలు గడుపుతున్నారని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. వెంటనే వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వ పరంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుచేయాలని ,జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టు పోరుబాట మొదటి విడత కార్యక్రమం జిల్లాలోని 15 మండలాల్లో విజయవంతమైందని తెలిపారు. ఇదే పోరాట స్ఫూర్తితో రెండు దఫాల ఆందోళన కార్యక్రమాలు జయప్రదం చేయాలని జర్నలిస్టులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు (జర్నలిస్టులు) ఎస్ వేణుగోపాల్, ప్రకాష్ గౌడ్,  కృష్ణంరాజు , బిక్కజి, ఎలక్ట్రానిక్ మీడియా రాజేంద్రప్రసాద్, దేవునురి రమేష్, అబ్దుల్ హన్నన్, నితీష్ కుమార్ , వారణాసి శ్రీనివాస్, సయ్యద్ సోజర్ , మేకల శ్రీనివాస్ ,దాసరి సురేష్ , జానకిరామ్, రాధాకృష్ణ చారి , రాజు ,కుమార్ ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.