మండలంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

Published: Wednesday May 04, 2022
బోనకల్, మే 3 ప్రజాపాలన ప్రతినిధి: దేశవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్ పండుగను మండలంలో ఘనంగా జరుపుకున్నారు. అన్ని మసీదులు, ఈద్గాలు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతు మండలంలో గ్రామాలలో మసీదు నందు ముస్లింలు నెల రోజుల ఉపవాస దీక్షలు అనంతరం మంగళవారం రంజాన్ పండుగను ఆనంద ఉత్సవాలతో జరుపుకున్నారు. కొత్త వస్త్రాలు ధరించి పరిమళ ద్రవ్యాలతో వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉండేలా నమాజ్ చేసుకొని అనంతరం ధనిక పేద తారతమ్యం లేక సహృదయాలతో, సద్భావన లతో ఒకరి ఒకరు స్నేహ భావంగా కలుసుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం రంజాన్, ధనిక, బీద అనే తారతమ్యం లేకుండా, ప్రతి ఒక్కరు విధిగా ఉపవాస దీక్షలు పాటించారు. కరోనా మహమ్మారి వల్ల రెండు సంవత్సరాలు జరుపుకొని పండుగ, ఈ సంవత్సరం లో జరుపుకోవడం పై మండలంలోని ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేశారు.