డా: బీ. ఆర్.అంబెడ్కర్ 132వ జయంతి వేడుకల కరపత్రం విడుదల

Published: Monday April 10, 2023

జగిత్యాల, ఏప్రిల్ 09 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని ఆదివారం రోజున తహశీల్ చౌరస్తాలో డా: బీ.ఆర్. అంబెడ్కర్ విగ్రహం వద్ద అంబెడ్కర్ సంగం నాయకులు అంబేద్కర్ జన్మదిన వేడుకల కరపత్రాన్ని విడుదల చేశారు. ఏప్రిల్ 14 శుక్రవారం రోజున నిర్వహించే అంబెడ్కర్132 వ  జన్మదిన వేడుకలను అంగారంగా వైభవంగా నిర్వహించాలని దళిత బడుగు బలహీన వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ దూమల రాజు కుమార్ బండ శంకర్ బాలే శంకర్ కారంగుల వసంత రావు దుమాల గంగారాం బిరుదుల లక్ష్మణ్ బోనగిరి దేవయ్య కొంగరి పవన్ ధర రమేష్ మోహన్ బొల్లి శేఖర్ దుమాల గంగారం గొడిసెల రమేష్ గంగాధర నరేష్ చిత్తరి ప్రభాకర్ కడమండ కమలాకర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.