వరుణుడి భీభత్సం..కూలిన వృక్షం

Published: Wednesday May 05, 2021
వికారాబాద్, మే 04, ప్రజాపాలన బ్యూరో : సాధారణంగా వేసవిలో వచ్చే వర్షాలు భీభత్సానికి నాందీగా ఉంటాయని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ అన్నారు. మంగళవారం బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి మామిడి చెట్టుతో సహా పాఠశాల కాంపౌండ్ వాల్ కూలాయని ప్రజాపాలన బ్యూరోతో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల విద్యాభ్యాసానికి ఎలాంటి అవాంతరం రాకుండా కాంపౌండ్ వాల్ రక్షణ కవచంగా ఉండేదని పేర్కొన్నారు. సంబంధిత విద్యాధికారులు ప్రాథమిక పాఠశాలను సందర్శించి వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ బి.శకుంతల, ఎస్ఎంసి చైర్మన్ మమత, ఉపాధ్యాయులు పరిశీలించారు.