పాడి పశువులతో ఆర్థిక ఆదాయం

Published: Wednesday March 17, 2021
చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి16 ( ప్రజాపాలన ) : తాండూర్ పట్టణ శివారు ప్రాంతంలో చాలా మంది పేద రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పశువులను జీవాలు (గొర్రెలు-మేకలు) పెంచుకొని ఆర్థికంగా లబ్ది పొందుతారని చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్ అండర్ బ్రిడ్జి ( ఆర్ యుబి ) రైల్వే అధికారులు మూసి వేయడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రైతులంతా పశువులను మేపడానికి రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్ యుబి) మార్గం ద్వారా వెళుతుండే వారు. ఇటీవల స్థానిక రైల్వే అధికారులు రోడ్ అండర్ బ్రిడ్జి మార్గా మూసి వేయడంతో దాదాపు 4 నుండి 5 కిలో మీటర్లు వెళ్లాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని పశువులకు పశుగ్రాసం సరిగా అందక ఆర్ధికంగా నష్టపోతున్నారని సాయిపూర్ కు చెందిన రైతుల బృందం బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22 వ తేదీన చేవెళ్ల ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అదే రోజు సికింద్రాబాద్ రైల్వే జీఎం తో ఫోన్లో మాట్లాడారు.
నేడు ఢిల్లీలో:
పార్లమెంటు లో రైల్వే బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సందర్భంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ ఎంపీ రంజీత్ రెడ్డి జోక్యం చేసుకొని మా తాండూర్ సాయి పూర్ రైతుల కోసం ముఖ్యంగా వారి పశువులను మేపుకోవడానికి  రోడ్ అండర్ బ్రిడ్జిని తెరవాలని డిమాండ్ జేశారు. మూగజీవాల ప్రేమికుడని పించుకున్నా రంజీత్ రెడ్డి అని పలువురు ప్రశంసించారు. తాను పశువైద్య వృత్తిలో మాస్టర్ చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి. ఆకలి అవుతుందని నోటితో చెప్పలేని మూగ జీవాల రోదనను ఒక పశువైద్యుడిగా అర్థం చేసుకొని 'పశువుల పశుగ్రాసం' కోసం పార్లమెంటు లో మాట్లాడటం పట్ల పలు జంతు, పశు ప్రేమికులు సామాజిక మాధ్యమాల్లో ఎంపీ రంజీత్ రెడ్డి ని ప్రశంసించారు.