దేశ్పాండే ఫౌండేషన్ తో ఎన్ఎస్వి డిగ్రీ కాలేజీ ఒప్పందం

Published: Wednesday September 15, 2021
జగిత్యాల, సెప్టెంబరు 14 (ప్రజాపాలన ప్రతినిధి): భారతదేశంలో కెరీర్ స్కిల్స్ డెవలప్మెంట్ లో ట్రేడింగ్ అందించే అగ్రగామి సంస్థ అయిన దేశ్పాండే ఫౌండేషన్ తో ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ ఒప్పందం చేసుకుంది. సోమవారం రోజు కర్ణాటక రాష్ట్రం, హుబ్లీ లో జరిగిన కార్యక్రమంలో దేశ్ పాండే ఫౌండేషన్ సంస్థ సిఇఓ ఏస్.బి నాయక్ ఎన్ఎస్వి విద్యాసంస్థల ప్రతినిధికి అగ్రిమెంట్ పత్రాన్ని అందజేశారు. ఎన్ఎస్వి విద్యాసంస్థల డీన్ మునిందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయినా నూతనంగా జాయిన్ అవుతున్న విద్యార్థులకు రెగ్యులర్ అకాడమిక్ విద్యతో పాటు, అదనంగా రోజు రెండు గంటల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అందిస్తామన్నారు. ప్రోగ్రాంలో బెంగళూరుకు చెందిన ఐటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ నిపుణులు విద్యార్థులకు 28 మాడ్యూల్స్ బోధనలతో, మెటీరియల్ అందిస్తానన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా వివిధ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించే అవకాశం లభిస్తుందని అన్నారు. స్వర్గీయ డాక్టర్ ముదిగంటి నవీన్ రెడ్డి  ఆశయ సాధనలో నూతన ఆలోచనలకు నాందిగా ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీతోపాటు కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లను అందించాలనే లక్ష్యంతోనే మేము, దేశ్ పాండే ఫౌండేషన్ వారితో సంయుక్తంగా జగిత్యాల జిల్లా విద్యార్థులకు ఉద్యోగాలను అందించడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాన్ని డిగ్రీ లో చేరబోయే విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని  వినియోగించుకోవాలని అన్నారు.