బ్రాహ్మణ పరిషత్ ఆర్థిక సాయం తో బ్యూటీ పార్లర్ ప్రారంభం

Published: Tuesday November 23, 2021
మధిర నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ ఆర్థిక సహాయంతో శ్రీమతి తుళ్లూరు యామిని రామాలయం రోడ్డు నందు ఏర్పాటు చేసుకున్న ఐశ్వర్య హెర్బల్ బ్యూటీ పార్లర్ పరిషత్ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర శర్మ ఈరోజు ప్రారంభించటమైనది. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ. బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎన్నో రకాల పథకాలను రూపకల్పన చేసిన తెలంగాణ రాష్ట్ర పరిషత్ చైర్మన్ కె.వి.రమణాచారి సీఈఓ చంద్రమోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అర్హులైన నిరుపేద బ్రాహ్మణులందరూ తెలంగాణ బ్రాహ్మణ పారిశ్రామికవేత్తల BEST పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా యామిని మాట్లాడుతూ అన్ని రకాల సౌందర్య వస్తువులు మరియు పార్లర్ కలదని తెలిపారు. రాష్ట్ర పరిషత్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అవధానుల లక్ష్మి సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ జక్కేపల్లి మురళీకృష్ణ, శ్రీ శివరాజు శ్రీనివాసరావు, శ్రీ గడ్డమణుగు శ్రీనివాసరావు, కప్పగంతు పట్టాభి రామ శర్మ, శ్రీ హరి రవి శాస్త్రి గారు, శ్రీ వెల్లంకి రాజేశ్వర ప్రసాద్, శ్రీ గడ్డమణుగు రామభద్రం, శ్రీ మాటూరు వెంకట మురళీకృష్ణ, విరిజా  పాల్గొన్నారు.