కాలనీవాసులు సమస్యలపై మంత్రికి వినతి

Published: Tuesday March 23, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; 36వ డివిజన్ కాలనీవాసులు సమస్యలపై  మంత్రికి వినతి సమర్పించారు మీర్ పేట్ కార్పొరేషన్ లోనీ 36వ డివిజన్ కాలనీవాసులు దుర్వాసన, దోమల బెడద విపరీతంగా పెరిగిందిని అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 36వ డివిజన్ లో ఉన్న ఎస్ ఎల్ ఎన్ ఎస్ కాలనీ వాసులు సమస్యలతో సతమతం అవుతున్నామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చెప్పారు. కాలని ప్రెసిడెంట్, ట్రంక్ లైన్ పనులు మూలంగా మంత్రాల చెరువు అవుట్ లైట్ మోయడం వల్ల దుర్వాసనతో  దోమలు బెడద చాలా ఎక్కువ ఉందని చెప్పారు. ఈ డివిజనలో రోడ్లు  పూర్తిగా  దెబ్బతిని పాడైపోయినవి. అదేవిధంగా రోడ్లు ఊడ్చే వారు కూడా లేకుండా పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడున్న శానిటేషన్ అధికారులకు కూడా మా బాధ తెలియజేశామని. మితుల నగర్ లో జరుగుతున్న ట్రంక్ లైన్ పండ్లలో వేగం పెంచి వెంటనే పనులు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే మంత్రాల చెరువు సుందరీకరణ పనులు తొందరగా ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బీసీ సెల్ దిండు భూపేష్ గౌడ్, కాలనీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.