ఎర్రుపాలెం మండలం తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు. పత్రికా విలేకరుల సమావేశం

Published: Friday July 16, 2021
పెరుపాలెం ప్రజా పాలన ప్రతినిధి 14వ తేదీ ఎరుపాలెంవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు గూడూరు రమణారెడ్డి వేమిరెడ్డి మల్లారెడ్డి. అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ karono దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రెండు నెలలపాటు నెలకు 15 కేజీల చొప్పున ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి. ఒక నెల ఇచ్చి రెండవ నెలలో చేతులు దులుపుకుంటున్నారు. ఈ నెల కేవలం ఒక మనిషికి ఐదు కేజీలు మాత్రమే ఇస్తున్నారు. 15 కేజీలు ఒక వ్యక్తికి ఇస్తానని మాట ఇచ్చి కేవలం ఐదు కేజీలు ఇస్తున్న సందర్భం ఈ రోజున జరుగుతుంది. దీనిని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ. తక్షణమే మీరు ఏ రకంగా అయితే రెండు నెలలు 15 కేజీల చొప్పున ఇస్తానని మాట ఇచ్చా రో.అదే విధంగా ఈ నెల కూడా ప్రతి వ్యక్తికి 15 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా ప్రజలకు అందించి ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ముఖ్యమంత్రి గారికి తెలుపుతూ. దీనితోపాటు ఉ మీరు ముఖ్యమంత్రి కావడానికి 58 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. రెండవసారి మీరు ముఖ్యమంత్రి అయి కూడా మూడవ సంవత్సరం జరుగుతుంది. కానీ మీరు ఇచ్చిన మాట ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదు.ఎంతో మంది భర్తలు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ విధానాన్ని వైయస్సార్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అతి త్వరలో మీరు నిలిపివేసిన పెన్షన్ అన్నింటినీ సక్రమంగా పేదవాడికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో. జానకి శివరాం. దేవరకొండ భూషణం. ఎస్ కే ఇస్మాయిల్. రాము. డాక్టర్ నర్సిరెడ్డి. సరోజిని. ఎస్ కె సుభాని. Imiliya. శౌరి. కాసిం .తదితరులు పాల్గొన్నారు.