డాక్టర్ రాంబాబు ని వెంటనే సస్పెండ్ చేయాలి: ఎమ్మార్పీఎస్

Published: Wednesday February 24, 2021
అశ్వరావుపేట ప్రజా పాలన; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో నందిపాడు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పదం నాగమణి కోవిడవ్యాక్సిన్ వికటించి మృతి చెందిందని దీనికి బాధ్యులు అయినటువంటి డాక్టర్ రాంబాబు ని వెంటనే సస్పెండ్ చేయాలని, అశ్వరావుపేట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినాయకపురం గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నాగమణి మృతి చెందితే ఆమెకు షుగర్ బి.పి ఉందని తప్పుడు ఆరోపణలు చూపించారని వారు ఆరోపించారు. ఇలా ఇంకా ఎవరికీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే నాగమణి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ,మూడు ఎకరాల భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సుబ్బారావు, జిల్లా నాయకులు కోలేటి పకీరయ్య, నార్ల పాటి నాగేశ్వరావు నార్ల పాటి సిద్దయ్య ,అశోక్ వేల్పుల నాగమల్లేశ్వరరావు, చిలక రావు, నాగరాజు ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.