అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించాలి

Published: Tuesday July 12, 2022
 మంచిర్యాల టౌన్, జూలై 11, ప్రజాపాలన : అంగన్వాడీ ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుఆధ్వర్యంలో సోమవారం రోజున అంగన్వాడి ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా  మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దర్నా, అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏ. భానుమతి,  రంజిత్ కుమార్ లు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత   ఐసిడిఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది, గతంతో పోలిస్తే కేంద్ర బడ్జెట్లో అతి తక్కువ బడ్జెట్ ఐసీడీఎస్ కి కేటాయించడం జరిగింది,నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడి కేంద్రాలను ఎత్తివేసే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వ ఉందని, దేశంలో ఉన్నటువంటి లక్షల మంది ఐసిడిఎస్ పరిధిలో పనిచేసే అటువంటి కార్మికులందరూ రోడ్డున పడుతారు,దీని ద్వారా లబ్ది పొందే   గర్భిణీ స్త్రీలు , విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారుతుందని, ఐసిడిఎస్ వ్యవస్థను ప్రైవేటికరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. 2017 వ సంవత్సరంలో పెంచినటువంటి  వేతనాలను సంవత్సరాలు గడిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేయట్లేదు. పెండింగ్లో ఉన్న టిఏ,డిఏ , ఏరియల్ బిల్స్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీచర్లకు ఆయాలకు వయోపరిమితి దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ అవకాశం కల్పించి, ప్రతినెల పెన్షన్ ఇవ్వాలని పలు సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పద్మ, అనురాధ, రాజమణి, మంగవతి, లీలా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area