సిపిఎస్ రద్దు చేసి ఓ పిఎస్ పునరుద్ధరించాలి: జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు 2022 జనరల్ ఫం

Published: Wednesday September 14, 2022
బోనకల్, సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యం లో మంగళవారం పి ఆర్ టి యు నాయకులు మండలం లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలుసుకుని సంఘ సభ్యత్వం,జనరల్ ఫండ్ నమోదు చేపట్టారు. ఈ సందర్భం గా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ దసరా సెలవుల్లోపు ఉపాధ్యాయ ప్రమోషన్స్,బదిలీలు చేపట్టి ముగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
317 జి. ఓ తో ఇతర జిల్లాలకు బదిలీ కాబడి ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు,ఇతర ఉపాధ్యాయుల కు న్యాయం చేయాలని కోరారు. పాఠశాలల్లో స్కావెంజర్స్ ను నియమించాలని,మధ్యాహ్న భోజన నిధులు క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
 జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్.బ్రహ్మారెడ్డి, జి.సుజాత, సిహెచ్.రవికుమార్,బోనకల్ మండల అధ్యక్ష,ప్రధానకార్యదర్సులు కే.రామ్ మోహన్, బి.వెంకన్న నాయకులు ఎస్.కె.మహ్మద్, ఎన్.దుర్గారావు, ఎస్ వి ఎన్.చారి,శ్రీనివాసరావు, బి.వెంకటేశ్వర్లు, జి.నాగలక్ష్మి, కే.ప్రమీల,మేడిశెట్టి.కృష్ణారావు పాల్గొన్నారు.
 
 
 
Attachments area