సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Saturday September 24, 2022
బోనకల్, సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో బతుకమ్మ చీరలు,కళ్యాణ లక్ష్మి చెక్కులు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
రాష్ట్రంలో ఆడపడుచులు అందరికీ సారెగా బతుకమ్మ చీరలు అందించడం జరుగుతోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం నాడు మండల కేంద్రంలో రైతు వేదిక నుందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు అందించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ సర్కారు లో మహిళలకు సముచిత గౌరవం దక్కిందని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, అందరు కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు. మహిళలకు పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అందులో భాగంగా ఆడపిల్ల పెళ్లికి అందించే కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు దేశంలో ఎక్కడ లేవని స్పష్టం చేశారు. అలానే కేసీఆర్ కిట్టు తో పాటుగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు లాంటి ఎన్నో పథకాలు మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ఎనిమిది ఏండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, తాసిల్దార్ రావూరి రాధిక, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఆర్ ఐ గుగులోత్ లక్ష్మణ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, రావినూతుల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఆళ్ళపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు, రామాపురం సర్పంచ్ తొండపు వేణు, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, రామాపురం ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు, బోనకల్ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, టిఆర్ఎస్ నాయకులు వేమూరి ప్రసాద్ ,పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.