ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *ఆసరా పెన్షన్లకు ఆదాయ పరిమితి విధించే జివో 17ను

Published: Friday January 13, 2023

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లకు ఆదాయ పరిమితి విధించే జీవో  17ను వెంటనే రద్దు చేయాలని, జిల్లావ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారికి పరికరాలు, రుణాలు, పెండింగ్లో ఉన్న వివాహ ప్రోత్సాహక వెంటనే విడుదల చేయాలని, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల్లో వికలాంగులకు మొదటి ప్రధాన శివ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 30న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం తీర్మానించింది     
    వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ సమావేశం ఈరోజు ఇబ్రహీంపట్నం లో అశాన్నగారి భుజంగారెడ్డి అధ్యక్షతన జరిగింది.
   ఈ సమావేశంలో జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగింది    
       తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల మంజూరుకు ఆదయపరిమితి విధిస్తూ 2014 సంవత్సరంలో జీవో నెంబర్ 17 విడుదల చేసింది ఈ జీవోను 2022 అక్టోబర్ నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం ద్వారా అర్హులైన అనేకమంది  లబ్ధిదారుల పింఛన్లు రద్దు అయినవి ప్రభుత్వ నిర్ణయం ద్వారా పెన్షన్ల మీద ఆధారపడిన వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు నెలల నుండి రద్దు చేసిన అర్హులైన వారి పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికలాంగుల వివాహ ప్రోత్సాహం వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లకు నిధులు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల వివాహ ప్రోత్సాహానికి మాత్రం ఎందుకు నిధులు విడుదల చేయడం లేదు. తక్షణమే నిధులు విడుదల చేసి దరఖాస్తు చేసిన వారందరికీ వివాహ ప్రోత్సాహకాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది.2020-21, 2021-2022, ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేయడం లేదు. బ్యాంకు లింకేజి లేనటువంటి 50,000 రూపాయల రుణాలను మాత్రమే పంపిణీ చేసి, బ్యాంకు లింక్ చేసినటువంటి రుణాలను మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్నటువంటి వేలాది మంది లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వలన నిరుద్యోగ వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసి లబ్ధిదారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఆసరా పెన్షన్లు ప్రతి నెల మొదటి వారంలోని చెల్లించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి నెల సక్రమంగా చెల్లించకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసరా పింఛన్లకు అవసరమైన నిధుల్ని ముందే విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు చెపుతుంటే మరోవైపు నెలల తరబడి పెండింగ్లో ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి నెల సకాలంలో ఆసర పింఛన్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మోటర్ వెహికల్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక టీచర్లను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలకు ధ్రువీకరణ పత్రాలను తక్షణమే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో స్పీచ్ మరియు హియరింగ్ క్లినిక్స్ పుట్ట గొడుగుల్ల పుట్టుకొస్తున్నాయి. వాటిపైన ప్రభుత్వ నియంత్రణ లేక పోవడం వలన ప్రతి నెల ఒక్కొక్క పేషెంట్ నుండి 30 వేల నుండి 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేనటువంటి పేద మధ్య తరగతి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్పీచ్ మరియు హియరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. ఆటిజం, సెరిబ్రల్ పాల్సి, క్లినికల్ న్యూరోలసికల్ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆటిజంతో బాధపడే విద్యార్థులు 5 లక్షల మంది ఉన్నారు. వీరికి సరైన వైద్యం లేకపోవడం ద్వారా వికలాంగులుగా మారే ప్రమాదం పొంచి ఉంది. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇచ్చే విధంగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వికలాంగులైన ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకపోవడం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతుంది. వికలాంగులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు చెల్లించడంలో సైతం అధికారం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది.