దళిత బంధు తో పాటు గిరిజన బంధు రాష్ట్రం మొత్తం అమలు చేయాలి : మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ

Published: Friday September 17, 2021
మధిర, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : కేసీఆర్కు దళిత సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రమంతటా పథకాన్ని అమలు చేయాలి -దారా బాలరాజు మధిర మండల sc సెల్ అధ్యక్షుడుతెలంగాణ pcc అధ్యక్షుడు *రేవంత్ రెడ్డితెలంగాణ clp లీడర్ మల్లు భట్టి విక్రమార్క పిలుపు మేరకు ఈరోజు మధిర మండల, పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, గద్దల లాలయ్యఆధ్వర్యంలో మధిర మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు. అన్ని గ్రామాల sc సెల్ అధ్యక్షులు.. మధిర కాంగ్రెస్ కార్యాలయం నుండి ర్యాలీ గా బయలుదేరి అంబెడ్కర్ సెంటర్లో అంబెడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి, మధిర మండల తాసిల్దార్ గారికి దళిత బంధు తో పాటు గిరిజన బంధు కూడా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు దళిత గిరిజన వర్గాల సంక్షేమ అభివృద్ధి ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక రకాల హామీలు ఇచ్చారు కానీ గత ఏడేళ్లుగా  ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు ప్రధానంగా అధికారంలోకి వస్తే ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడంతోపాటు, ఏడాదిపాటు లబ్ధిదారునికి అవసరమైన వ్యవసాయ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు, కానీ ఏ ఒక్క దళిత, గిరిజన కుటుంబం కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏది ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో లక్షా 17 వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఇచ్చి దళిత గిరిజన యువతకు ఆర్థిక సహాయం అందించి ఉంటే లక్షలాది యువకులు వారి కాళ్లపై వారు నిలబడి ఆత్మగౌరవంతో బతికే వారు కేసీఆర్ ఇచ్చిన హామీలను కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేసి ఉంటే లక్షలాదిమంది దళిత గిరిజన బిడ్డలు విద్యావంతులు విజ్ఞానవంతులు అయ్యేవారు దళిత బంధు పేరుతో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు అదికూడా పైలెట్ ప్రాజెక్టు కింద ఉప ఎన్నికలు జరుగుతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నిక వర్గానికే పరిమితం చేస్తున్నారు. కేసీఆర్ దళిత సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రమంతటా పథకాన్ని అమలు చేయాలని మరియు అదేవిధంగా రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలకు కూడా ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చారు రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వెంటనే గిరిజనులకు కేసీఆర్ హామీ ప్రకారం 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి తెలంగాణ ఆత్మగౌరవం కోసమే దళిత గిరిజన కార్యక్రమంలో మరోసారి పోరాటం చేస్తున్నాం మా హక్కులు సాధించేవరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం సాగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకట రమణ గుప్త, మునిసిపల్ కౌన్సిలర్లు కోన ధని కుమార్,మునుగోటి వెంకటేశ్వరరావు, నియోజక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర రెడ్డి, బయ్యారం సర్పంచ్ ప్రకాశం, బయ్యారంఎంపీటీసీజయరాజు, జలిముడి సర్పంచ్ కారుమంచి ప్రభాకర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షైక్ ఫయజ్, మండల intuc అధ్యక్షుడు కోరంపల్లి చంటి, మాజీ సర్పంచ్ లు కర్నాటి రామారావు, బొమ్మ కంటి హరిబాబు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్య, సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబుకాంగ్రెస్ నాయకులు సూర్యదేవర కోటేశ్వరరావు, కోట డేవిడ్, వనామా పిచ్చయ్య, తిరువీధుల వెంకటేశ్వర రావు, మోచర్ల సురేష్, గద్దల విజయ్, కంటిపోగు లాజర్, రెంటపల్లి శ్రీనివాసరావు, గద్దల సురేష్, బండారు నరసింహారావు సంపసాల రామకృష్ణ, b ఆదిములం శ్రీనివాస్ రావు, మైలవరపు చక్రితదితరులు పాల్గోన్నారు.