మోడీ పర్యటనకు నిరసన తెలిపిన సింగరేణి కార్మికులు బెల్లంపల్లి నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి:

Published: Friday November 11, 2022
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇచ్చిన పిలుపుమేరకు గురువారం బెల్లంపల్లి ఏరియాలోని గనులు, వివిధ డిపార్ట్మెంట్, లలో  సింగరేణి కార్మికులు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో,  సంఘం కేంద్ర కమిటీ నాయకులు గెల్లిరాజ లింగు, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఆయన మాట్లాడుతూ
కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో నీ బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని, సంవత్సరం క్రితమే ప్రారంభమైన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించే నెపం తో,  తెలంగాణలో అడుగుపెట్టడాన్ని నిరసిస్తున్నామని అన్నారు. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను  వేలంలో పెట్టడాన్ని, అదేవిధంగా 44 చట్టాలను, నాలుగు కోడ్ లు గా మార్చడాన్ని,  అన్నిప్రభుత్వ రంగ సంస్థలను అధాని, అంబానీల వంటి బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టడాన్ని , తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
సింగరేణి కార్మికులకు రావలసిన వేజ్ బోర్డును ఇప్పటివరకు పరిష్కరించలేదని, ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని కోరిన  స్పందించడం లేదని, సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికీ వేలంలో కేటాయించడం వలన సింగరేణి నిర్వీర్యమై, తెలంగాణ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ, అవకాశాలు కోల్పోయే ప్రమాదముందని, వీటన్నింటికీ కారణమైన ప్రధానమంత్రి, కార్మిక క్షేత్రమైన రామగుండం రావడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని అన్నారు.
తెలంగాణకు పరిశ్రమలు, సంస్థలను కేటాయించి, బొగ్గు గని కార్మికుల హక్కులను రక్షించిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్  కార్యదర్శి అనుముల సత్యనారాయణ, డి, భాస్కర్, రస రంజని, దాసరి అరుణ సుందరి, ఫార్మసిస్ట్ స్వరూపారాణి, వార్డ్ అసిస్టెంట్లు, జనరల్  మజ్దూర్లు, సానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.