అనుమతులు ఉన్నా ,నిర్మాణాన్ని ఆపుతున్నారు. అధికారులు న్యాయం చేయాలి.

Published: Saturday December 10, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: అన్ని అనుమతులు ఉన్నప్పటికీ  ఆంజనేయస్వామి దేవస్థానం స్తలమంటూ పలువురు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని,  వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు వాసంశెట్టి మార్కండేయ
 అధికారులకు విజ్ఞప్తి చేశాడు.
శుక్రవారం స్థానిక బాబు క్యాంపు  ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు,
బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ ప్రాంతంలో అన్ని అనుమతులతో తాను నిర్మించుకుంటున్న ఇంటి నిర్మాణాన్నీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యులమని చెప్పుకుంటున్న గాలి శ్రీనివాస్,బజరంగ్ అనే వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశాడు.
 2004లో తన తండ్రి మాగంటి రామచంద్రరావు,జగదీష్ అనే వ్యక్తుల నుండి ఇంటి స్థలం కొనుగోలు చేశాడని, ఈ స్థలానికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్  ఉందని,  తన ఇంటి స్థలం విషయంలో ఆలయ కమిటీకి తనకు మధ్య పలుమార్లు పంచాయతీలు జరిగి ఒప్పందాలు కూడా జరగాయని తెలిపాడు,
అయినా ఇద్దరు వ్యక్తులు తన ఇంటి నిర్మాణం పనులు ఆపాలని బెదిరింపులకు పాల్పడుతూ, లక్ష రూపాయలు  వారు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
స్థానిక మున్సిపల్,రెవిన్యూ అధికారుల నుండి తనకు అన్ని అనుమతి పత్రాలు ఉన్నాయని, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.