కరోనా మృతుల అంత్యక్రయలకు మేమున్నము

Published: Saturday May 15, 2021
పాలేరు, మే 14, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని రావి చెట్టు తండా గ్రామానికి చెందిన బాణోత్ నాగేశ్వరరావు, కరుణ వైరస్ తో మరణించగా కరోనా వైరస్ ఆత్మీయత, అనుబంధాలకు అడ్డుతెరలు కడుతోంది. చివరి చూపు, స్పర్శకు నోచుకోకుండా నా అన్నవాళ్లను దూరం చేస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరు దరిచేరని దయనీయ స్థితిలో కరోనా మృతుల అంత్యక్రియలను తమ భుజాలపై వేసుకుంటున్నారు, కూసుమంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ - చెన్న మోహన్ గార్లు భయానక వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంటే ధైర్యం కోల్పోకుండా మానవత్వంతో, మృతదేహాలకు కడసారి వీడ్కోలు పలుకుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు వీరు. సాధారణంగా కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు భయపడి, దగ్గరికి కూడా రావడం లేదు. కొంతమంది బంధువులు మాత్రం దూరం నుండి ఓదార్పు చెప్పి వెళుతున్నారు. కాని ఈ రోజు, స్థానికులు (రావిచెట్టు తండా వాస్తవ్యులు) బాణోత్ నాగేశ్వరరావు (Senior LIC Agent) గారి దహన సంస్కారాలు చేసేందుకు సాహసించి, కార్యక్రమం పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు కూసుమంచి సర్పంచ్ చెన్న మోహన్ మరియు ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ వారి సహచరులు