వేసవి కాలంలో మొక్కలకు నీరుపోసి సంరక్షించాలి

Published: Thursday March 25, 2021
పల్లె ప్రగతి పనులు  సకాలంలో పూర్తి చేయాలి -  జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
 
జగిత్యాల, మర్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ అధ్యక్షతనలో జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ది అధికారులతో అభివృద్దపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమము ద్వారా గ్రామాలు పరిశుభ్రత పచ్చదనంతో కళకళ లాడాలని ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రతి గ్రామములో పల్లె ప్రగతి కార్యక్రమములు నిర్వహించి గ్రామాలను పరిశుభ్రంగ వుండే విదంగా గ్రామాలను సందర్శించి గ్రామ మండల స్థాయిలోని ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్ణీత కాలములో పూర్తి అయేవిదంగా తగు చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ది అధికారులకు సూచించారు. నర్సరీలలో అన్ని రకాల మొక్కలను నీడనిచ్చే మొక్కలు పూల మొక్కలు ఔషదం (హెర్బల్) మొక్కలను పెంచి రాబోయే హరితాహారం కార్యక్రమములో నాటే విధముగా చెట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకోని మొక్కలను సంరక్షించుటకు అధికారులు దృష్టి పెట్టాలని తెలియజేశారు. జిల్లాలో వైకుంఠ దామము ప్రగతి దశలో ఉన్న వాటిని ఏప్రిల్ 15 2021 లోగా పూర్తి చేయాలని వసంత కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్ శ్రీలత ఎంపీడీఓలు అధికారులు పాల్గొన్నారు.