వేసవి దృష్ట్యా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసన

Published: Saturday February 25, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 24, ప్రజాపాలన  :
 
వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ పథకం క్రింద ప్రతి ఇంటి శు ద్ధజలం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, సి.ఈ. & ఎస్.ఈ. జ్ఞాన్కుమార్, నీటి పారుదల శాఖ ఈ. ఈ. అంజన్ రావు, ఈ. ఈ. (గ్రిడ్) మధుసూదన్, జిల్లా పరిషత్ వైస్చర్మన్ సత్యనారాయణతో కలిసి మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, మారుమూల గ్రామాలకు సైతం త్రాగునీటి సరఫరా జరిగే విధంగా చూడాలని తెలిపారు.  జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో 5 మండలాలలో 102 గ్రామపంచాయతీలు, 3 మున్సిపాలిటీల పరిధిలో 64 వార్డుల వారిగా మిషన్ భగీరథ, గ్రిడ్ పనులు కొనసాగుతున్నాయని, నియోజకవర్గ పరిధిలో 1 వేయి 72 కిలోమీటర్ల మేర పైప్ లైన్ పనులు పూర్తి చేయడం జరిగిందని, మెయిన్ గేట్కు సంబంధించి 482 కిలోమీటర్ల పైపైన్ పనులు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు 283 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి 67 వేల 163 నివాసాలకు 2 లక్షల 62 వేల మంది ప్రజలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ ఇంట్రా పనులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తినట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.