కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి: సిపిఎం

Published: Tuesday September 28, 2021
 బోనకల్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ సందర్భంగా రావినూతల ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలను రావినూతల సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బంద్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గుగులోతు పంతులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని రైతాంగ నల్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రైవేటీకరణను విడనాడాలని  కార్మికులకు న్యాయం చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అసైన్డ్ భూములకు సైతం పట్టాలు ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 1వ శాఖ కార్యదర్శి మందా వీరభద్రం, 2వ శాఖ కార్యదర్శి కొంగర భూషయ్య, ఎస్కే అబ్దుల్, యర్రగాని నాగేశ్వరరావు, మరీదు వెంకటేశ్వర్లు, బోయినపల్లి నాగేశ్వరరావు, మరీదు వెంకటేష్, లావురి వెంకటేశ్వర్లు బోయినపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.