ప్రత్యేక అవసరాల దివ్యాంగుల కొరకు శిబిరం

Published: Tuesday November 08, 2022
జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి
వికారాబాద్ బ్యూరో 7 నవంబర్ ప్రజా పాలన : ప్రత్యేక అవసరాల దివ్యాంగుల కొరకు శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నామని జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్షణ తెలంగాణ ఆర్టిఫిషియల్ రిమ్స్ మ్యానిఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎఎల్ఐఎంసిఓ ) ఆధ్వర్యంలో  నవంబర్ 9న  భవిత కేంద్రం వికారాబాద్ దగ్గర జిల్లాలోని   దివ్యాంగుల  కొరకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు దివ్యాంగులను పరీక్షించి వారికి అవసరమైన పరికరాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు.  ఈ శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు వారి ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సదరం సర్టిఫికెట్ (వైకల్యం నలభై శాతం కన్నా ఎక్కువగా ఉన్నవారు), సదరం సర్టిఫికెట్ లేని వారు ప్రభుత్వ వైద్యుని దగ్గర సర్టిఫికెట్ పొంది దానిపైన మండల విద్యాధికారి లేదా ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రువీకరించి ఈ శిబిరానికి హాజరుకావాలని తెలిపినారు. కావున జిల్లాలోని దివ్యాంగులు అందరూ ఈ నెల 9న నిర్వహించే ఉపకరణాల నిర్ధారణ శిబిరానికి ఉదయం 10 గంటల వరకు వికారాబాద్ లోని భవిత సెంటర్ ( మండల విద్యాధికారి  వికారాబాద్ వారి కార్యాలయం వెనక వైపున) హాజరుకావాలని జిల్లా విద్యాధికారిణి తెలియజేసినారు.