అఖిలపక్ష ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి

Published: Thursday March 31, 2022

మధిర మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో అఖిలపక్ష ఆధ్వర్యంలో మధిరలో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే మధిరలో బడ్డీ కోట్లను తొలగించాలని అఖిలపక్ష నేతలు కోరారు. బుధవారం మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన బడ్డీ కొట్లు తొలగింపు కార్యక్రమాన్ని వారు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అఖిలపక్ష నేతలు సూరం శెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్తా, శీలం నరసింహారావు, మండవ పనీంద్ర కుమారి, మల్లాది హనుమంతరావు, దొంతమాల కిశోర్ కుమార్, స్వామి మాదిగ మాట్లాడుతూ  మధిర మున్సిపాలిటీ పరిధిలో బడ్డీ కొట్లు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ట్రాఫిక్ ఇబ్బందులు అనే పేరు పెట్టి బడ్డీ కొట్లు తొలిగించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలి అన్నారు. దీనివల్ల అనేక సంవత్సరాలుగా  మధిరలో చిరు వ్యాపారులు చేసుకుంటున్న చిరువ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లత ఇచ్చిన హామీ ప్రకారం చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే బడ్డీ కొట్లను తొలగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. అధికార పార్టీ నేతలు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని బడ్డీ కొట్లు తొలగింపు  విషయంలో అమలు చేయటం దుర్మార్గమన్నారు. తక్షణమే అధికారులు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు దారా బాలరాజు పారుపల్లి విజయ్ పాపినేని రామ నర్సయ్య, మందా సైదులు మద్దాల ప్రభాకర్ కొరంపల్లి చంటి, బిట్రా ఉద్దండయ్య, పెరుమాళ్ళ పల్లి ప్రకాశ రావు, షేక్ మస్తాన్ పాషా పాల్గొన్నారు.