ఘనంగా మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు

Published: Friday July 08, 2022

జన్నారం రూరల్, జూలై 07, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో యమ్అర్పిఎస్ మందకృష్ణ మాదిగ యాభైఎనిమిద వ పుట్టినరోజు వేడుకలను మండల కేంద్రంలో అ సంఘ నాయకులు ఘనంగా గురువారం జరుపుకున్నారు, ఈ సందర్భంగా మండల కేంద్రంలో  కేక్ కట్ చేసి స్వీట్ పంచిపేట్టుకున్నారు, స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా స్థానిక యమ్అర్పిఎస్ సీనియర్ నాయకుడు మామిడిపెళ్లి ఇందయ్య మాట్లాడుతూ మాదిగల సంక్షేమం కోసం  అయన ఎంతో కృషి చేశాడని ఈ రోజు మాదిగలకు రాష్ట్రంలో ఒక గౌరవం ఒక గుర్తింపు వుంది అంటే మందకృష్ట మాదిగ వలనే వచ్చినదని అయన అన్నారు, రాష్ట్రంలో యమ్అర్పిఎస్ పార్టీ అవిర్భావించి నేటికి ఇరువైఎనిమిది సంవత్సరాలు గడిచాయని అయన గుర్తు చేశారు, గత ఉమ్మడి   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు కోసం ఉచిత వైద్యం చేయాలని పోరాటం చేసిన వ్యక్తిని అయన తెలిపారు, వికలాంగుల హక్కుల పట్ల సరైన న్యాయం చేయాలని వారికి ఫించన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా గొప్ప వ్యక్తి అని తెలిపారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకుడు బోర్లకుంటా ప్రభుదాస్, మండల యమ్అర్పిఎస్ నాయకులు దూమల్ల ప్రశాంత్, ప్రవీణ్, రత్నం లచ్చన్న, జంగం రవి, దూమల్ల రమేష్, మంద రాజేష్,  ప్రభుదాస్, సునీల్, జైకుమార్, సురేష్, ఏసుదాస్, అజేయ్ తదితరులు పాల్గొన్నారు.