పట్లూరులో ఏముల శివప్ప అంత్యక్రియలకు ఆర్థిక సహకారం

Published: Monday January 31, 2022
గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజాపాలన : పట్లూరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ ఏముల ఆనందం తండ్రి ఏముల శివప్ప అనారోగ్యంతో మృతి చెందారని గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వెంటనే కుటుంబ సభ్యులు కానీ సమీప బంధువులు కానీ గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ కు నేరుగా సమాచారం తెలపాలని సూచించారు. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సర్పంచ్ కు సమాచారాన్ని నేరుగా తెలియజేయకపోవడంతో అంత్యక్రియలకు ఆర్థిక సహకారం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏముల శివప్ప మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు సమాచారాన్ని సర్పంచ్ కు నేరుగా తెలపడంతో సర్పంచ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుని కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. పట్లూరు గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వెంటనే కుటుంబ సభ్యులు, సమీప బంధువర్గము 8309 111 757, 9177 360 320 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులు సమాచారాన్ని నేరుగా తెలిపినవారికి మాత్రమే అంత్యక్రియలకు ఆర్థిక సహకారం అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహిజ్, వార్డ్ మెంబర్స్ ఒగ్గు నర్సిములు, బోహిని లాలయ్య, అంజాత్, బాలేష్, సుకెందర్, డైరెక్టర్ సంగన్న, మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, నాయకులు మోహన్, యేసు, లక్ష్మయ్య, చిన్న, ప్రవీణ్ లు కుటుంబ సభ్యులను పరామర్శించారు.