AISF జెండాను ఆవిష్కరించారు జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్ గౌడ్

Published: Friday August 13, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : AISF 86వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మన్నెగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన AISF జెండాను జిల్లా ఉపాధ్యక్షుడు పి.శివకుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి.శివకుమార్ మాట్లాడుతూ  స్వాతంత్య్రం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ల ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12న AISF ఆవిర్భవించిందని తెలిపారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తికై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన - స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని, భరతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవకిషోరుల  బలిదానం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనకు సమాధి కట్టడంలో అగ్రభాగాన నిలిచిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం AISF అని అన్నారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రనంతరం  ప్రభుత్వ విద్య పరిరక్షణకై, శాస్త్రీయ. కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 85 సంవత్సరములుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా - పోరాటాలే ప్రాణంగా - విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడుతాం_-_ చదువుకై పోరాడుతాం. అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం మలిదశ తెలంగాణ పోరాటంలో. హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది. AISF. సమరశీల ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమై 85 సంవత్సరాలు పూర్తి చేసుకొని 86వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్ధినీ, విద్యార్థులకు, ఏఐఎస్ఎఫ్ నాయకులకు, కార్యకర్తలకు, విద్యాబుద్ధులు నేర్పే ఉపాద్యాయులకు, శ్రేయోభిలాషులకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 86వ ఆవిర్భవ దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు శివ, కార్యదర్శి శ్రీకాంత్, రాజునాయక్, సీపీఐ నాయకులు గువ్వల రాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.