బాజోజి భాస్కర్ సేవలు మరువలేనివి...

Published: Monday May 10, 2021
సారంగాపూర్, మే 09 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు స్వర్గీయ బాజోజి భాస్కర్ చిత్రపటానికి సారంగాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వరుణ్ మాట్లాడుతూ స్వర్గీయ భాస్కర్ విద్యార్థి దశ నుంచి క్రియాశీలక రాజకీయలో ఉంటూ ఎంతో మంది యువకులకు రాజకీయ ఓనమాలు నేర్పిన వ్యక్తి అని వారి మృతి జిల్లా బీజేపీలో తీరని లోటని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలుగలని కోరుకుంటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శాంతయ్య బాధినేని శేఖర్ తోట సంతోష్ తెలు నరేష్ వంగపెళ్లి పవన్ బొడ్డుపెళ్లి శేఖర్ కొర్రీ తిరుపతి పాల్గొన్నారు.