ఘనంగా డాక్టర్స్ డే

Published: Saturday July 03, 2021
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ డాక్టర్స్ డే సందర్భంగా నిన్న సాయంత్రం, మధిర వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ మురళి కృష్ణ, మరియు డాక్టర్ అనిల్  కుమార్ ఘనంగా సత్కరించారు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైద్యులు చేస్తున్నటువంటి సేవలు అమోఘమైనవని, వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ వృత్తిని నిర్వహిస్తున్నారని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ఇరుకుళ్ల సురేష్ రీజనల్ చైర్మన్ వేములపల్లి ప్రసాదరావు, మాజీ డిప్యూటీ గవర్నర్ మిరియాల వెంకటరమణ గుప్తా, జోన్ చైర్మన్ కేతపల్లి సతీషు, అధ్యక్షులు నందిగామ పురుషోత్తం, చల్లా సత్యనారాయణ, కేతేపల్లి పావని మాజీ అధ్యక్షులు ఇరుకుల్ల నాగేశ్వరరావు, మరియు వికాస తరంగిణి చైర్మన్ కుంచం కృష్ణ రావులు పాల్గొన్నారు.