రైతులకు పంటలపై అవగాహన కల్పించాలి

Published: Tuesday June 08, 2021

నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి
సిపిఐ(ఎంఎల్)రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూన్ 06, ప్రజాపాలన : జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు పంటల పైన పూర్తి అవగాహన కల్పించి, గ్రామ గ్రామాన వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రైతులకు పంట పైన అవగాహన కల్పించి, గ్రామాలలో సమావేశాన్ని నిర్వహించాలని, వర్షాకాలంలో వేసే పంట పై పూర్తి అవగాహన రైతులకు కల్పించాలన్నారు. విత్తనాలు, ఎరువుల, పైన వారికి నాణ్యమైన విత్తనాలు ఏవో తెలియజేయాలన్నారు. బార్ కోడ్ ఉన్న విత్తనాలను రైతులు వాడాలని, నకిలీ విత్తనాలపై పూర్తి అవగాహన కల్పించి రైతులకు న్యాయం చేయాలన్నారు. వర్షాకాలం రాగానే దళారులు రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అనుమతి లేని ఫర్టిలైజర్స్ వాటి పై చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనం కవర్ పైన ఉన్న రేట్లను తగ్గించి తక్కువ ధరలకే అందించే విధంగా చూడాలన్నారు. విత్తనాలు, ఎరువులు, మందులు, ప్రభుత్వం అందించే విధంగా చూడాలన్నారు.