పోచమ్మ దేవత ప్రతిష్టాపనకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు ఆహ్వానం

Published: Thursday August 26, 2021
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3 వార్డులో ఈనెల 26, 27వ తేదీలలో పోచమ్మ దేవత ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి ప్రశాంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి కి ఆహ్వాన శుభ పత్రిక బుధవారం అందించడం జరిగిందని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలియజేశారు. 26వ తేదీ గురువారం ప్రతిష్ట పురోహితులు దూస శ్రీనివాస్, నల్లాన్ చక్రవర్తుల త్రివిక్రమ్ ఆచార్యులచే స్వస్తి వాచనము, గణపతి పూజ పుణ్యావాచనం, దీక్షాధారణ, అఖండ దీపారాధన, అగ్నిప్రతిష్టాపన, వాస్తు,  నవగ్రహ, క్షేత్రపాలక, సర్వతోభద్ర ప్రధాన కలశస్థాపనములు, యజ్ఞం, జలాదివాసం, జలాదివాస హోమము, ధన్యదివాసామ్, శయాదివాసం, హోమం, మంత్రపుష్పం 27వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆహ్వాన దేవతాపూజ ప్రతి స్టాంగ హోమం, యంత్ర ప్రతిష్ట ఉదయం 11 గంటల 15 నిమిషాలకు అభిజిత్ లగ్నం సుముహూర్తం లో పోచమ్మ దేవత ప్రతి స్థాపన, మంగళ హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదము, ఆశీర్వచనం జరుగుతాయని అంబేద్కర్ నగర్ కాలనీ ఆలయ నిర్మాణ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ ఆలయ నిర్మాణ కమిటీ మూడో వార్డు కౌన్సిలర్ భర్తకి జగన్, పోచమ్మ ఆలయకమిటీ  తెలిపారు.