బనిగండ్లపాడు గ్రామం లో ఉన్న బీసీ హాస్టల్ పరిస్థితి

Published: Friday July 16, 2021
ఎరుపాలెం ప్రజాపాలన ప్రతినిధి 14వ తేదీ ఎరుపాలెం మండలంబనిగండ్లపాడు గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉండి చుట్టూ పిచ్చి చెట్లు మొలచి హాస్టల్ భవనం లా కాక గేదెలకు మేత నిచ్చే ఆహారంగా ఉన్నటువంటి భవనం. ఈ భవనాన్ని పట్టించుకునే నాధుడు లేడు అదేమిటని హాస్టల్ వార్డెన్ ని అడిగితే భవనం బాగాలేదు ఎవరికి  విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. అయితే ఇదివరకు ఒకసారి ఈ భవనం గురించి పేపర్లో వచ్చింది అయినా గాని ఈ భవనాన్ని పట్టించుకునే నాధుడు లేడు. ఎస్సీ హాస్టల్లో ఉండే విద్యార్థులు ఎక్కడ ఉండాలి అనే సమస్య తలెత్తుతుంది. బీసీ హాస్టల్లో ఉండే విద్యార్థులు ఎస్సీ హాస్టల్ లో ఉంటే మరి ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఎక్కడ ఉండాలి. ఇది చాలా సమస్యగా మారింది కానీ దీని గురించి పట్టించుకునే పాలకులు లేరు. కరోనా కారణంగా ప్రస్తుతం పాఠశాలలు అన్ని మూసివేయబడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలకి వెళ్లకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే హాస్టల్ లు కూడా తెరిచే ఆలోచన ఉంది కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి బీసీ హాస్టల్ భవనాన్ని ఇవ్వవలసిందిగా హాస్టల్ వార్డెన్ కృష్ణ కిరణ్ పేర్కొన్నారు.