పోలీసులను పెట్టి నిర్బంధించి, గేట్లకు తాళాలు వేసి విద్యార్థినులను ఖైదీల కంటే ఘోరంగా నిర్బం

Published: Monday September 05, 2022
  ఆదివారం  రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహింపట్నం అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో  కనీస పసతులు అందించలేని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తక్షణమే రాజీనామా చేయ్యాలని బహుజన్ సమాజ్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము.
గత 4 రోజులుగా ఇబ్రహింపట్నంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కనీస అవసరాల వసతులు సరిగా లేవు అని దాదాపు 400 మంది విద్యార్థినులు మాకు తినే అన్నంలో పురుగులు, తాగడానికి మచి నీళ్ళు లేవు, వాడుకోవడానికి, కడుక్కోవడానికి బాత్రూంలో నీళ్ళు లేవు, కనీసం అన్నం తిన్న తరువాత ప్లేట్ కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేక ఒకే ప్లేట్ లో 10 మందిమి అన్నం తిన్నాo అని వాపోయారు. ముందే అమ్మాయిలు చెప్పుకోలేని సమస్యలు, ప్రతీ నెలా పీరియడ్ సమస్యలు ఉంటాయి నీళ్ళు లేకపోతే ఎంతోఇబ్బంది పడాల్సివస్తుందనీ కన్నీళ్లు పెట్టుకున్నా పిల్లలని చూసిన ఏ పేరెంట్ కైన కన్నీళ్లు ఆగడంలేదు. పిల్లలపై పేరెంట్స్ మాకు టిసి ఇవ్వండి మేము వేరే దగ్గర చదివిపించుకుంటామంటూ తల్లిదండ్రుల ఇది కేసీఆర్ పాలన_ దొరల పాలన...
ఈ సమస్యలు తెలుసుకోకుండా పోలీసులను పెట్టీ, గేట్లకి తాళాలు వేసి ఒక కారాగారంగా మార్చిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉంది  కాబట్టి విద్యార్థినులు పడుతున్న అవస్థలు, అక్కడ ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలనీ లేని ఏడల  బీఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో..
జిల్లా కార్యదర్శి అసెంబ్లీ ఇంచార్జీ పల్లాటి రాములు
అసెంబ్లీ అధ్యక్షులు గ్యార  మల్లేష్ ఉపాధ్యక్షులు ధార యాదగిరి , అసెంబ్లీ మహిళా కన్వీనర్ నూకల అనిత , మండల కన్వీనర్లు మచ్చ మహేందర్ , గడ్డం మల్లయ్య , కంబాలపల్లి రజినీ , సెక్టార్ కమిటీ సభ్యులు కంబాల పల్లి కిషన్, పెద్ద ముత్తని గణేష్, ఎర్ర యాదగిరి, చెరుకూరి భరత్, లింగంపల్లి జగన్, ఎర్ర ఇబ్రo, ప్రసాద్, బాబయ్య, పోలే శ్రీను,  తదితరులు పాల్గొన్నారు.