వ్యాక్సినేషన్ నేటికి పది రోజులు పూర్తి

Published: Tuesday June 15, 2021
బాలపూర్, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : సూపర్ స్పైడర్ వారికి వ్యాక్సినేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పది రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవంతంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ వివిధ శాఖల అధికారులు దిగ్విజయం చేసినందుకు పలు సెంటర్ల ప్రజా ప్రతినిధులు విధినిర్వహణలో పాల్గొన్న వారికి శాలువాతో సన్మానించి  బహుమతులతో సత్కరించారు. బాలపూర్ మండలం లోని బాలపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బాలపూర్ మండలంలో మూడు వ్యాక్సినేషన్ సెంటర్లు ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి రోజు ప్రారంభించి సూపర్ స్పైడర్ వారికి పది రోజులు వ్యాక్సినేషన్ ఏ సెంటర్ లో ఎక్కడ సూపర్ స్పెండర్ వారికి అంతరాయం లేకుండా విధినిర్వహణలో చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వారు వెల్లడించిన ప్రకారంగా బడంగ్ పేట్ కార్పొరేషన్ లోని  జిల్లా పరిషత్ పాఠశాల వ్యాక్సిన్ సెంటర్లో 8098 సూపర్ స్పైడర్ వారికి వేశామని, మీర్ పేట్ కార్పొరేషన్ లోని జిల్లెల్గుడా చల్లా లింగారెడ్డి ఉన్నత పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్లో 7666  సూపర్ స్పైడర్ వారికి వేశామని, అదేవిధంగా జల్ పల్లి మున్సిపాలిటీ జిల్లాపరిషత్ పాఠశాలలో 2942 సూపర్ స్పైడర్ వారికి వేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ వేసుకున్న వారందరూ కరోనాను కట్టడి చేయాలని ప్రతి ఒక్కరూ సహకరించినందుకు విధి నిర్వహణ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ...... ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వారు విశ్వాసనీయత కలిగి శ్రద్ధతో విధి నిర్వహణ నిర్వహించి, సూపర్ స్పైడర్ వారికి ధైర్యం నమ్మకం వరస కలిగించారనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మీర్ పేట్ కార్పొరేషన్స్ కమిషనర్లు కృష్ణమోహన్ రెడ్డి, సుమన్ రావు, డీ ఈ అశోక్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, డి ఇ గోపీనాథ్, ఏ ఈ కృష్ణయ్య, ఆరో ఓ అంజయ్య, కార్పొరేషన్ అధికారులు, జల్ పల్లి చైర్మన్, వైస్ చైర్మన్ర్ కార్పొరేషనల మేయర్స్, డిప్యూటీ మేయర్స్, ప్రజా ప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.