దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సు పాసులు

Published: Saturday October 15, 2022
డిపో మేనేజర్ బి మహేష్ కుమార్
వికారాబాద్ బ్యూరో 14 అక్టోబర్ ప్రజా పాలన : దివ్యాంగులు ప్రభుత్వ ఆసుపత్రి నుండి సదరన్ ధ్రువీకరణ పత్రంతో వచ్చిన వారికి 50 శాతం రాయితీతో బస్ పాసులు ఇవ్వబడునని వికారాబాద్ డిపో మేనేజర్ బి మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 శాతం రాయితీతో సంవత్సరం పొడుగునా బస్సులో ప్రయాణం చేయొచ్చని, అదేవిధంగా  అంధులకు వారితో పాటు ఒక అటెండర్ కు కూడా 50 శాతం రాయితీతో బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కలదని వివరించారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ బి.మహేష్ కుమార్ సూచించారు. స్కూల్ పిల్లల కొరకు ఉచిత బస్ పాస్ ల గడువు ఈ నెల 31 వరకు పొడిగించబడినదన్నారు. బస్ పాస్  తీసుకోని విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉంటే చేవెల్ల వికారాబాద్ మోమిన్పేట్ బస్టాండ్ లలో ఉన్న కౌంటర్లలో బస్ పాసులు పొందగలరని స్పష్టం చేశారు. వివాహాది శుభకార్యములకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వబడునని చెప్పారు. డిపాజిట్ లేకుండా తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును అని డిపో మేనేజర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి అనుభవజ్ఞులైన డ్రైవర్లు ఉంటారని భరోసా ఇస్తున్నారు. పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్సులనే బుక్ చేసుకోవాలి కోరారు.