జాతీయ మాల మహానాడు బూర్గంపాడు మహిళ అధ్యక్షురాలుగా మేకల శేషమ్మ నియామకం బూర్గంపాడు ( ప్రజా పాలన

Published: Tuesday November 15, 2022
మండలంలోని సారపాక గ్రామానికి చెందిన మేకల శేషమ్మను బూర్గంపాడు మహిళా అధ్యక్షురాలుగా నియమిస్తూ జాతీయ మాల మహానాడు బూర్గంపాడు మండల అధ్యక్షుడు, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ పిల్లి రవి వర్మ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు బూర్గంపాడు మహిళా అధ్యక్షురాలు మేకల శేషమ్మ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జాతీయ క్రమశిక్షణ అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ అశోద భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి, టీ రమణమూర్తి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడెల్లి  గణపతి, నియోజకవర్గ ఇన్చార్జ్ రవివర్మ ల కు కృతజ్ఞతలు తెలిపారు. బూర్గంపాడు మండలంలో మహిళల సమస్యల పరిష్కారం కొరకు మాల మహానాడు బలోపేతం కొరకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ పిల్లి రవి వర్మ మాట్లాడుతూ గ్రామస్థాయిలో సంఘం బలోపేతం చెయ్యాలని అన్నారు. హలో మాల_చలో వరంగల్ డిసెంబర్ 18 న వరంగల్లో జరిగే మాలల సమరభేరి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని అందుగ్గాను నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలో గోల గీత, బోయిన తిరుపతమ్మ, మోత్కూరి  వెంకటలక్ష్మి, జంగం సునీత, బందెల సౌజన్య, జంగం స్రవంతి తదితరులు పాల్గొన్నారు.